స్కై లాబ్ లాంటి సినిమాలు చేయడమే నా డ్రీమ్ః నిత్య మీనన్
శనివారం, 6 నవంబరు 2021 (17:18 IST)
Nithya Meenan, Rahul Ramakrishna, Dr. Ravi Kiran, Vishwak
బండ లింగపల్లిలో గౌరి (నిత్యా మీనన్) ఓ ధనివంతురాలి బిడ్డ. కానీ జర్నలిస్ట్ కావాలనే కోరికతో ప్రతిబింబం పత్రికకు వార్తలు సేకరించి రాస్తుంటుంది. డాక్టర్ ఆనంద్ (సత్యదేవ్) తన గ్రామంలో హాస్పిటల్ పెట్టాలనుకుంటాడు. అయితే తనకు కాస్త స్వార్థం. తన పని పూర్తయితే చాలు అనుకునే రకం ఆనంద్, ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తుంటాడు. వీరితో పాటు సుబేదార్ రామారావు జత కలుస్తాడు. వీరి జీవితాలు ఏదో రకంగా సాగుతుంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య. మరి వారి సమస్యలు తీరాలంటే ఏదైనా అద్భుతం జరగాలని అనుకుంటారు.
అదే సమయంలో అంతరిక్ష్యంలో ప్రవేశ పెట్టిన ఉపగ్రహం స్కైలాబ్‌లో సాంకేతిక కారణాలో పెను ప్రమాదం వాటిల్లబోతుందని రేడియోలో వార్త వస్తుంది. అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందని అందరూ భావిస్తారు. అప్పుడు అందరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి. అనే విషయాన్ని తెలుసుకోవాలంటే స్కై లాబ్ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది. డిసెంబర్ 4న సినిమా విడుదలవుతుంది.
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం స్కైలాబ్. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. శనివారం జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, నిర్మాత పృథ్వీ పిన్నమరాజు, దర్శకుడు విశ్వక్ ఖండేరావు తదితరులు పాల్గొన్నారు.
చిత్ర సమర్పకుడు రవికిరణ్ మాట్లాడుతూ రెండేన్నరేళ్ల జర్నీ ఈ సినిమా. అనేక చర్చలు అన్నీ పూర్తయిన తర్వాత సినిమాను స్టార్ట్ చేశాం. ఈరోజు ట్రైలర్ విడుల చేశాం. డిసెంబర్ 4న సినిమాను విడుదల చేస్తున్నాం. విశ్వక్‌కు స్టోరీపై అద్భుతమైన గ్రిప్ ఉండేది. కమలాకర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డిగారి వల్ల ఈ ప్రాజెక్ట్‌లో నేను ఇన్‌వాల్వ్ అయ్యాను. పృథ్వీగారితో మంచి అసోసియేషన్ నడిచింది. పొలాలు, డబ్బులు ఇవేమీ విలువైనవి కావు. హ్యుమన్ వేల్యూస్ ముఖ్యమని ఈ సినిమా చివరలో చూపించాం. మా బ్యానర్ వేల్యూస్‌ను నిలబెట్టే చిత్రమవుతుందని నమ్మకంగా ఉన్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు మా సినిమాను సక్సెస్ చేస్తారని భావిస్తున్నాం. నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్‌గారికి స్పెషల్ థాంక్స్ అన్నారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. ఈ కథ గురించి మా అమ్మ నాన్నల దగ్గర కూడా మాట్లాడాను. వారు చాలా విషయాలు చెప్పారు. పాత జనరేషన్‌కు తెలిసిన విషయం. నేటి జనరేషన్‌కు కొత్త విషయం కాబట్టి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని భావించాం. ఇలాంటి సినిమాలు చేయడమే నా డ్రీమ్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు చేయాలని నిర్మాతగా, నటిగా అనుకుంటున్నాను. విశ్వక్ విజన్‌ను మేం సపోర్ట్ చేశామంతే. తను ట్రూ ఫిల్మ్ మేకర్. తన ఇలాంటి సినిమాలు చేస్తానంటే నేను తన సినిమాలను ప్రొడ్యూస్ చేస్తాను. నా కెరీర్‌లో ఓ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌ను తొలిసారి కలిశాను. డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు. అర్థం చేసుకోవాలి. ఆ విషయంలో పృథ్వీ ఓ అడుగు ముందున్నాడు.హండ్రెడ్ పర్సెంట్ మూవీ సక్సెస్ అవుతుంది అన్నారు.
సత్యదేవ్ మాట్లాడుతూ, ఆదిత్య విజువల్స్ చూసి పూరీ జగన్నాథ్‌గారు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ప్రశాంత్ అద్భుతమైన మ్యూజిక్‌ను అందించాడు. రవితేజ బ్రిలియంట్‌గా వర్క్ చేశాడు. పూజిత చక్కగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. స్కైలాబ్ ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ మూవీ. ట్రైలర్‌లో చూస్తే నాకే నేను కొత్తగా కనిపించాను. సినిమా అద్భుతంగా వచ్చింది. రాహుల్‌తో ఎప్పుడు వర్క్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతాను. నిత్యామీనన్‌గారితో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేయడమనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో తను భాగమైనందుకు ఆమెకు థాంక్స్. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. డిసెంబర్ 4న స్కైలాబ్‌ను చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను అన్నారు.
నిర్మాత పృథ్వీ పిన్నమరాజు మాట్లాడుతూ మా ఫ్యామిలీ ఇది వరకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండింది. నిర్మాతగా నేను తొలి అడుగులు వేశాను. నిత్యామీనన్ ఎంతగానో సపోర్ట్ చేశారు. స్కైలాబ్ స్క్రిప్ట్ చదవగానే నిర్మాతగా సినిమాను చేయలేను అని చెప్పలేకపోయాను. సినిమా మేకింగ్‌లో డైరెక్టర్ విశ్వక్ ఐడియాలజీ ఎంతగానో నచ్చింది అని తెలిపారు.
హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ (వీడియో ద్వారా) నేను స్కైలాబ్ ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. నా స్నేహితుడు సత్యకు అభినందనలు. నిత్యామీనన్‌గారికి, రాహుల్ రామకృష్ణకి కంగ్రాట్స్. డిసెంబర్ 4న సినిమా విడుదలవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను అన్నారు.
దర్శకుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ, ఈ కథను ముందు రాహుల్‌కే నెరేట్ చేశాను. అక్కడి నుంచి డైరెక్టర్‌గా ట్రావెట్ స్టార్ట్ అయ్యాను. ఇక సత్యదేవ్‌గారు అయితే ప్రతి సీన్ ఎలా చేయాలి? ఏం చేయాలి? అడిగి మరీ సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ ఆదిత్య సినిమాటోగ్రఫీతో పాటు డైరెక్షన్ టీమ్‌తో కలిసి కూడా వర్క్ చేశాడు. ఎడిటర్ రవితేజ సినిమాను అద్భుతంగా ఎడిట్ చేశాడు. ప్రశాంత్ విహారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సింక్ సౌండ్‌లో సినిమాను చేశాం. అందరి సహకారంతో సినిమాను డిసెంబర్ 4న మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు.