#GangLeaderTeaser సందడి చేస్తున్న 'పెన్సిల్ పార్థసారథి గ్యాంగ్'

బుధవారం, 24 జులై 2019 (17:02 IST)
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కగా వచ్చే నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరు పెంచారు. ప్రీ లుక్, ఫ‌స్ట్ లుక్, సాంగ్ అంటూ చిత్రానికి సంబంధించి ప‌లు అప్‌డేట్స్ ఇచ్చిన టీం తాజాగా టీజ‌ర్ రిలీజ్ చేసింది. పెన్సిల్‌, అత‌ని గ్యాంగ్ చేసే సంద‌డిని టీజ‌ర్‌లో చూపించారు. పెన్సిల్ పార్థసార‌థి పాత్ర‌లో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్ అని ప‌రిచ‌యం చేసుకుంటాడు. టీజ‌ర్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది.
 
ఈ చిత్రంలో "ఆర్‌ఎక్స్ 100" ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తుండగా, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఇదిలావుంటే, ఆగస్టు 30న ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రం కూడా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో గ్యాంగ్ లీడ‌ర్ విడుదల తేదీని వాయిదా వేస్తారా లేదా అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు