అనూప్ రూబెన్స్ మంచి బీట్ తో కంపోజ్ చేసిన 'కాంతార కాంతార..' పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్ పాటలోని ఎనర్జీని రెట్టింపు చేసేలా పాడారు. 'ఎందుకె చిట్టి నువ్వు ఇట్లా పుట్టినావు మందిని సంపుతావు ఏందే, మా లెక్కనే నీకు రెండు కాళ్లు చేతులు ముక్కు మూతి ఉన్నయి గాదె, బలుపు నీకు ట్విన్ బ్రదరా, ఈగో నెత్తి మీద ఫెదరా, మనషులంటే నీకు పడరా, నువ్వేమన్న అవతారా, ఎమి చూసుకుని నీకు ఇంత టెక్కూ, దిష్టి బొమ్మకైన పనికి రాదు నీ పిక్కూ ..కాంతార కాంతార కాంతారా...' అంటూ సాగుతుందీ పాట. కాలేజ్ లో హీరోయిన్ ను హీరో టీజింగ్ చేసే సందర్భంలో ఈ పాటను రూపొందించారు.