జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా సరదాగా వుంటుంటారు. గతంలో పోలిస్తే ఆయనలోని సీరియస్ నెస్ తగ్గింది. తాజాగా మాత్రుమూర్తితోపాటు కుటుంబాన్ని తీసుకుని కర్నాటకలోని పలు దేవాలయాలను దర్శించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కుటుంబం కూడా ఆయన వెంట వచ్చారు. తాజాగా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టితో కలిసి నటిస్తారా? అని బెంగుళూరు విలేకరులు అడిగితే.. అన్నీ కుదిరితే రిషబ్ ఓకే అంటే నేను ఓకే అంటూ సరదా సంభాషణలు సాగాయి.