సీమంతం చేసుకున్న "నువ్వు నేను" హీరోయిన్

సోమవారం, 19 అక్టోబరు 2020 (18:57 IST)
కొన్నేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన చిత్రం "నువ్వు నేను". ఈ చిత్రంలో అనిత హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఈమె పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో వెండితెరకు దూరమైంది. ఈ క్రమంలో 2013లో రోహిత్ రెడ్డిని వివాహమాడిన ఆమె, దాదాపు ఏడేళ్ల తర్వాత తమ బిడ్డను స్వాగతించనుంది.
 
తాజాగా జరిగిన సీమంతం చిత్రాలను అనిత నెట్టింట పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. తనకు ఓ పెద్ద బేబీ పుట్టబోతున్నాడని ఆమె పెట్టిన కామెంట్‌కు లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. తన కడుపులో బిడ్డ కుడివైపునకు ఎక్కువగా కదులుతున్నాడని, ఈ ఫోటోల్లో చూడవచ్చని కూడా అనిత చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు