పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రికుడైన విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా నటించారు.
ఈ నేపథ్యంలో మృతి చెందిన ఫ్యాన్ కుటుంబానికి ప్రభాస్ అండగా నిలిచారు. ఇంకా అభిమాని కుటుంబానికి ప్రభాస్ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. పెదకోటేశ్వరరావు భార్య పిచ్చమ్మకు, తల్లిదండ్రులకు చెక్కును అందించారు.