పైగా, నిజంగా తాము రిలేషన్‌షిప్‌లో ఉంటే ఏ ఇటలీలోనో, ఏదైనా బీచ్‌లోనో సంతోషంగా తిరిగేవాళ్లమే కదా ప్రభాస్ అని ప్రశ్నించాడు. అసలు ఇందులో దాచాల్సిన విషయం ఏమిటో తనకు అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికాడు.
కాగా అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, ఆమె కోసం లాస్‌ఏంజెల్స్‌లో సాహో ప్రత్యేక షో వేయిస్తున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ సినిమాగా తెరకెక్కిన 'సాహో' ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.