కన్నప్ప నుంచి ప్రీతి ముఖుంధన్ లుక్

డీవీ

సోమవారం, 30 డిశెంబరు 2024 (16:53 IST)
Preeti Mukundhan Look
‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సోమవారం హీరోయిన్ ప్రీతి ముఖుంధన్ రోల్ ఎలా ఉండబోతుందో తెలుపుతూ తాజాగా బ్యూటిఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కన్నప్పలో ఆమె నెమలిగా కనిపించబోతుంది. అందంలో సహజం, తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం, భక్తిలో పారవశ్యం, కన్నప్పను సర్వస్వం, చెంచు యువరాణి నెమలి అంటూ తాజాగా వదిలిన ఈ పోస్టర్ పై రాసిన పదాలు ఈ క్యారెక్టర్ పట్ల క్యూరియాసిటీ పెంచుతున్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
 
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు పోషించిన పాత్రల పోస్టర్స్ వదిలింది. 
 
ఈ సినిమాలో  ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మలుస్తున్న చిత్ర యూనిట్, ఏప్రిల్ 25, 2025న ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు