రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఠాగూర్

గురువారం, 27 మార్చి 2025 (11:16 IST)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'ఆర్‌సి16'. ఈ రోజు చెర్రీ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే, ముందు అనుకున్నట్టే ఈ చిత్రానికి "పెద్ది" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
అలాగే, ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను కూడా చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. గుబురుగడ్డం, పొడవాటి జట్టుతో చరణ్ ఊరమాస్ లుక్‌లో అదరగొట్టారు. ఈ చిత్రంలో చెర్రీ పక్కన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 
సెన్సేషనల్ మ్యాజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ బాణీలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

 

Happy Birthday my Dear @AlwaysRamCharan Sir...
In one word you are Gold Sir ????????????????

Tqq for everything Sir ???????????????????????? pic.twitter.com/aNc1QLGU8q

— BuchiBabuSana (@BuchiBabuSana) March 27, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు