రంగస్థలం సినిమా సక్సెస్ మీట్‌కు రంగం సిద్ధం అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ సమ్మర్‌లో పండగ చేసుకోబోతున్నారు. రంగస్థలం సక్సెస్ మీట్‌కు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా రానున్నారు. ఇప్పటికే రంగస్థలం సక్సెస్ మీట్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్ రిలీజ్ అయ్యింది. రామ్ చరణ్‌తేజ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''రంగస్థలం'' మార్చి 30 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై నాన్ బాహుబలి రికార్డ్స్‌ను తుడిచిపెట్టేసిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం.
మరోవైపు తన భర్త రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా బంపర్ హిట్ కావడంతో కామినేని ఉపాసన కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన మొక్కు తీర్చుకున్నారు. గురువారం సాయంత్రం నడకను ప్రారంభించిన ఆమె, కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆపై శుక్రవారం ఉదయం ఉపాసన వీఐపీ బ్రేక్ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ సిబ్బంది ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు.