ఈ వార్తలపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. రైతుల జీవితాలను, వారికష్టనష్టాలను వెలుగులోకి తెచ్చేందుకే సాక్షి మైక్ చేతబట్టానని చెప్పారు. అంతేకానీ ఇందుకు రాజకీయాలకు ముడిపెట్టవద్దని... ఓ టీవీ కార్యక్రమంలో భాగంగా రైతుల కష్టాలను షూట్ చేయాల్సి వచ్చిందని రేణూ దేశాయ్ వెల్లడించారు.
ఇప్పటి వరకు తాను 200 మంది రైతులను కలిశానని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని, తన కార్యక్రమం వల్ల ఒక్క రైతైనే బాగుపడినా సంతోషిస్తానని వెల్లడించారు. రైతుల కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేశానని.. రైతుల కోసం ఓ సినిమా రాశాను. దానికి అనుగుణంగానే రైతులను కలిశానని రేణు దేశాయ్ తెలిపారు.