సంక్రాంతి అంటేనే కొత్త సినిమాలు, ప్రయాణాలు ప్రజలకు సర్వసాధారణం. ఊరెళ్ళాలంటే బస్సులు, ట్రయిన్ లలో తమ సంతోషాన్ని వెతుక్కొనేందుకు వెళుతుంటారు. కుటుంబంతో హాయిగా గడిపేందుకు సిద్ధమవుతారు. ప్రజల అవసరాలను కనిపెట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా ఏర్పాట్లు చేసి టికెట్ కు డబుల్ రేటు పెట్టి మరీ గుంజేవారు. ఒకరకంగా చెప్పాలంటే తెలివైన దోపిడీ చేసేవారు. ఇంకోపక్క సినిమా థియేటర్లలో టికెట్ రేటు కూడా అలాగే మారింది. థియేటర్లో 150 టికెట్ వుంటే దానికి మరింత జోడించి రేట్లు పెంచేశారు. ఇలా పెంచమని ప్రజలేమీ అడగరు. కానీ కొద్దిరోజుల్లోనే అటు నిర్మాతగానీ, ఇటు ప్రభుత్వాలు కానీ కోట్ల రూపాయలు ప్రజల జేబుల్లోంచి లాగేసుకుంటున్నారని విశ్లేషకులు తెయజేస్తున్నారు.