"సరిలేరు నీకెవ్వరు" యూనిట్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ప్రిన్స్

ఆదివారం, 12 జనవరి 2020 (11:58 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు". అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
ఫలితంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంది. సంక్రాంతి సెల‌వులు కావ‌డంతో థియేట‌ర్స్ కూడా ప్రేక్ష‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. చిత్రం స‌క్సెస్ టాక్‌తో దూసుకెళుతున్న క్ర‌మంలో శనివారం రాత్రి స‌రిలేరు నీకెవ్వ‌రు టీం బ్లాక్ బ‌స్ట‌ర్ పార్టీ జ‌రుపుకుంది. 
 
ఈ పార్టీలో మ‌హేష్‌, న‌మ్ర‌త‌, అనీల్ రావిపూడి, దేవి శ్రీ ప్రసాద్, అనీల్ సుంక‌ర‌, సంగీత‌, ర‌ష్మిక‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, సితార త‌దిత‌రులు పాల్గొన్నారు. మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో గ్రూప్ ఫోటో షేర్ చేస్తూ.. బ్లాక్ బ‌స్ట‌ర్ పార్టీ, సెల‌బ్రేష‌న్ బిగిన్స్ అని ట్వీట్ చేశారు. కాగా, మహేష్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు