సినిమాకేకాదు జీవితానికి సెకండాఫ్‌ ముఖ్యం అదే మళ్ళీ పెళ్లి కథ : ఎం.ఎస్‌.రాజు

గురువారం, 11 మే 2023 (16:46 IST)
MS raju, naresh, pavitra
నవరస రాయ డా. పవిత్ర లోకేష్‌తో కలిసి మెగా మేకర్ ఎమ్‌ఎస్ రాజు దర్శకత్వంలో నరేష్ వికె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ మళ్లీ పెళ్లి మే 26న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విలక్షణమైన కథాంశంతో తొలిసారిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మించారు. సినిమా, టీజర్‌తో పాటు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
 
టీజర్ ఎలా ఉదంటే .. 
మూడు ప్రధాన పాత్రలను పరిచయం చేసేలా టీజర్ ఉండగా, ట్రైలర్ కథాంశాన్ని వెల్లడిస్తుంది. నరేష్ తన సహనటి పవిత్రా లోకేష్‌లో నిజమైన ప్రేమను తెలుకున్న సూపర్ స్టార్,  తోటి వ్యక్తికి కూడా చక్కటి  భావాలు ఉన్నాయని గ్రహిస్తాడు.. ఇద్దరికీ అప్పటికే పెళ్లయింది మరియు పవిత్ర లోకేష్ నరేష్ పట్ల తన భావాలను దాచడానికి ప్రయత్నిస్తుంది. నరేష్ మాజీ భార్య వనిత విజయ్‌కుమార్ మీడియాను ఆశ్రయించడంతో విషయాలు గందరగోళంగా మారాయి.
 
కథాంశం చాలా ఆసక్తిని కలిగిస్తుంది మరియు కథనం మరింత ఆకర్షణీయంగా ఉంది. నరేష్, పవిత్ర లోకేష్ పాత్రలను ఎంఎస్ రాజు ఆసక్తికరంగా డిజైన్ చేశారు. సూపర్‌స్టార్ పాత్రలో నరేష్ సరిగ్గా కనిపించాడు,  పవిత్ర లోకేష్ తన పాత్రను సమర్ధవంతంగా పోషించారు.. మరికొందరు తమ తమ పాత్రల్లో కన్విన్సింగ్‌గా కనిపించారు.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ, జీవితంలో అనుకోని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. నాకూ జరిగాయి. ముందునుంచి నేను దర్శకుడిని అవ్వాలనుకున్నా. 13 ఏళ్ళ వయస్సులో మీనా సినిమాను మా కుటుంబంతో చూశాను. ఇప్పుడు ఆ సంస్థకు నేను దర్శకత్వం వహిస్తానని ఊహించలేదు. ఈ సందర్భంగా నరేష్‌కూ, పవిత్రగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా దర్శకత్వం టీమ్‌కు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
 
నవరసరాయ నరేష్‌ మాట్లాడుతూ, నాకు ఊహ తెలిసినప్పటినుంచీ విజయనిర్మలగారు, కృష్ణగారు దేవుళ్ళు. వారి మేకప్‌ చైర్‌లోనే కూర్చుని పండంటి కాపురంకు మేకప్‌ వేసుకున్నాను. నటుడి కావాలనేదే నా కోరిక. అలా నేను బాలనటుడిగా నటించిన పండంటి కాపురం 1972లో రిలీజ్‌ అయింది. ఎస్‌.వి.రంగారావు వంటి హేమాహేమీల మధ్య నటించా. 1973లో నాతో అమ్మగారు ఆలోచనలను పంచుకున్నారు. అందుకే ఆ బేనర్‌ విలువ తెలుసు. ఇక మూడేళ్ళనాటినుంచి ఎం.ఎస్‌.రాజుగారితో ట్రావెల్‌ అవుతున్నాను. రెబల్‌ కథతో సినిమా చేయాలనుకున్నా. ఈ సినిమా కథ గురించి ఆలోచిస్తుండగా విజయకృష్ణ మూవీస్‌ మరలా ప్రారంభించడానికి అద్భుతమైన కాన్సెప్ట్‌ కుదిరింది అనిపించింది. అందుకే చేశాం. ఇప్పుడు ట్రైలర్, టీజర్‌ చూశారు. ఇది మచ్చు తునక మాత్రమే సినిమాలో చాలా విషయం వుంది. ఈ కథకు టైటిల్‌ ఏమి పెట్టాలని అనుకున్నప్పుడు గతంలో కృష్ణగారు, విజయనిర్మలగారు నటించిన మళ్ళీ పెళ్లి గుర్తుకువచ్చి, అదే టైటిల్‌ పెట్టాలనిపించింది. ఈ కథకు కూడా యాప్ట్‌ అయిన టైటిల్‌. చాలా సంతోషంగా వుంది. గౌరవప్రదమైన సినిమా తీశాం. గొప్ప అనుభూతిని మీకు అందిస్తాం. ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా చాలా బాగుంటుంది అని అన్నారు.
 
నటి పవిత్ర లోకేష్‌ మాట్లాడుతూ, విజయకృష్ణ ఫిలింస్‌ బేనర్‌లో సినిమాలు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేవిధంగా వుంటాయి. ఈ బేనర్‌కు కృష్ణ, విజయనిర్మలగారి ఆశీస్సులుంటాయి. మళ్ళీ పెళ్లి సినిమా గురించి చెప్పాలంటే, ఎం.ఎస్‌.రాజుగారి గురించి చెప్పాలి. ఆయన సినిమాలు ఆయన ఏమిటో చెబుతాయి. ప్రతి సీన్‌లో ఆయన ఆలోచనలు అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన దర్శకత్వంలో నటించాలంటే నటుడుకి ప్రతిరోజు ఛాలెంజ్‌లా వుంటుంది. దర్శకుడిగా ఆయన ఏం కోరుకున్నారో అది రాబట్టడానికి ప్రయత్నిస్తారు. చాలా కూల్‌గా కావాల్సింది రాబట్టుకున్నారు. వ్యక్తులకు ఆయన ఇచ్చే గౌరవం వంటివి ఆయనుంచి చాలా నేర్చుకున్నా. ఇందులో పనిచేసిన  ప్రతి టెక్నీషియన్స్‌ ది బెస్ట్‌ ఇచ్చారనే చెప్పాలి. బాల్‌రెడ్డి కెమెరానైపుణ్యం చాలా బాగుంది. ఇలా అందరూ బాగా తమ పని తాము చేశారు.  నా పాత్ర గురించి రాజుగారు డెలివర్‌ చేసేటప్పుడు పాత్రకు పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను. సహ నటుడు నరేష్‌గారు ఫైన్‌ యాక్టర్‌ ఇన్‌ ఇండియా అని చెప్పగలను. ఈ సినిమా చూశాక ప్రతివారు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటామని తెలిపారు.
 
అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సినిమా కథ గురించి వేసిన ప్రశ్నకు నరేష్‌ సమాధానం ఇస్తూ, రఘుపతివెంకయ్యనాయుడు బయోపిక్‌లో నేను నటించాను. కానీ మళ్ళీపెళ్లి సినిమా అనేది నా బయోపిక్‌ కాదు. ప్రతివారికి ఏదో ఒకచోట కనెక్ట్‌ అయ్యేలా రాజుగారు కథను తీసుకువచ్చారు. ఇది నా కథ కాదు అని చెప్పారు.
 
చిత్ర కథ గురించి దర్శకుడు ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ, ఈ సినిమా థీమ్‌ ఏమిటంటే, ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ బాగుండాలి. అది సినిమాకే కాదు జీవితం కూడా అలాగే వుండాలని అనుకుంటాం. ఇది ప్రపంచ సమస్య. దీనిపైనే ఓ సినిమా తీయాలనుకుని చేసిందే మళ్ళీ పెల్లి అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు