బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్ బాస్ 14 లో హినా ఖాన్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ హీరో సిద్ధార్థ్ శుక్లాకు మంచి క్రేజ్ వస్తోంది. ఈసారి బిగ్ బాస్‌లో 'తిప్పరా మీసం' హీరోయిన్ నిక్కి తంబోలి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఆమె బలమైన పోటీదారుగా ఎదిగింది. మొదటి రెండు టాస్క్‌లను గెలవడంతో పాటు, ఆమె హౌస్‌లో కన్‌ఫామ్ అయిన మొదటి కంటెస్టెంట్ కూడా. ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా మార్చడంలో దిలాక్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ షాను వంటి ఆర్టిస్టులు కృష్టి చేస్తున్నారు.