ప్రముఖ సింగర్ సునీతకు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆమే స్వయంగా స్పందించారు. తనపై అసత్య కథనాలు వెల్లడించడంపై సునీత ఫైర్ అయ్యారు. కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన కథనాలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.