Sadan, Priyanka Prasad, PL Vignesh, sohel, Raj Kandukuri
సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతోన్న చిత్రం 'ప్రణయ గోదారి'. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ప్రణయ గోదారి మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రణయగోదారి టీం అంతా కలిసి ఓ చిన్నారి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం ఆర్థిక విరాళాన్ని అందించింది.