టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకులు, నటులపై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు మకాం మార్చిన శ్రీరెడ్డి.. తమిళ దర్శకులు మురుగదాస్, శ్రీకాంత్, సుందర్ సి, రాఘవ లారెన్స్‌లపై కూడా వేధింపుల ఆరోపణలు చేసింది.