చైతన్ భరద్వాజ్ స్వరపరిచి కనులెందుకో సోల్ ఫుల్ మెలోడీని నిఖితా శ్రీవల్లి, చైతన్ భరద్వాజ్ అద్భుతంగా అలపించారు. కీబోర్డ్ నోట్స్‌తో పాటు అకౌస్టిక్ గిటార్, బాస్, ఎలక్ట్రిక్ మాండొలిన్ ఇంపాక్ట్ ని పెంచుతుంది. వెంగీ ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించాడు.
సుధీర్ బాబుని బయట కలవడం గురించి మాళవిక హింట్ ఇవ్వడం పాట ప్రారంభమవుతుంది. ఇద్దరూ కలిసి కొంత క్యాలిటీ టైం గడపడానికి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లడంతో వారి ప్రేమ ప్రయాణం ప్రారంభమవుతుంది. పాటలో వారి కెమిస్ట్రీ ప్లజెంట్ గా వుంది. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కనులెందుకో మంచి కంపోజిషన్ తో ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.