వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సుధీర్ బాబుకి ప్రత్యేకత వుంది. ప్రేమకథాచిత్రమ్ లాంటి హర్రర్ కామెడి చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భలేమంచి రోజు లాంటి విభిన్నమైన కథనంతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. `నన్నుదోచుకుందువటే, సమ్మొహనం` చిత్రాలతో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియన్స్ కూడా ఆకట్టుకున్నారు. కథల విషయంలో కంగారు లేకుండా ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు.
అదేవిధంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.. ఈ టైటిల్ ప్రకటించిన దగ్గరనుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్టయ్యింది. విడుదలయ్యిన మెదటి లుక్ కి విపరీతమైన క్రేజ్ రావటం తెలిసిందే అయితే సుధీర్ బాబు పుట్టినరోజు సందర్బంగా శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి సంబందించి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ విడదలయ్యి అవ్వగానే సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వటం ఈ చిత్రంపై అభిమానుల, ప్రేక్షకుల అంచనాలు ఏరేంజి లో వున్నాయో తెలియజేస్తుంది.
ఈ చిత్రాన్ని భలేమంచిరోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి బ్లాక్‌బస్టర్ హ్యట్రిక్ చిత్రాలు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి 1978 పలాస చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీదేవి సోడా సెంటర్ గ్లింప్స్ ఎలావుందంటే!
సుధీర్‌బాబు పుట్టినరోజు సందర్బంగా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో మెదట గోదావరి లో బోట్స్ ని చూపించారు. షర్ట్ లేకుండా లైటింగ్ సూరిబాబు బోట్ ని నడపడం, లైటింగ్ కొట్టడం, రౌడీల్ని కొట్టడం, తరువాత గోదావరి లోనుండి సిక్స్‌ప్యాక్ బాడీతో బోట్ ఎక్కడం లాంటి విజువల్స్ మన కళ్ళని ఎటూ తిప్పుకోనివ్వవు. ఆ విజువల్స్ చూస్తున్నంతసేపు సుధీర్‌బాబు ఎక్కడా కనిపించడు లైటింగ్ సూరిబాబు మాత్రమే కనిపిస్తాడు. శ్యామ్ దత్ కెమెరా విజువల్స్, మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఆకట్టకుంటుంది.