మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

దేవీ

సోమవారం, 5 మే 2025 (13:59 IST)
Suri, Suhas first look
ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌ అధినేత ఎల్రెడ్ కుమార్ తన 16వ ప్రాజెక్ట్ గా "మండాడి" అనే  స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ప్రకటించింది. "సెల్ఫీ" సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు మతిమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ప్రధాన పాత్రలో నటుడు సూరి కనిపించనున్న ఈ చిత్రంలో తెలుగులో మంచి గుర్తింపు పొందిన సుహాస్ తన తమిళ అరంగేట్రం చేస్తున్నారు. కథానాయికగా మహిమా నంబియార్ నటిస్తున్నారు. అన్ని భాషల్లోను ఆకట్టుకునేలా చిత్రాన్ని మలుస్తున్నారు.
 
ఇటీవల టైటిల్ మరియు సూరి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నిర్మాతలు, తాజాగా సుహాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. లుంగీ ధరించి, నెరిసిన జుట్టుతో, జెర్సీ వేసుకుని "సునామీ రైడర్స్" బృందంతో సముద్రతీరంలో నిలిచిన సుహాస్ రూపం అభిమానులను ఆకట్టుకుంటోంది. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ స్వయంగా పడవలు నడుపుతూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా కనిపించడం సినిమాలో వారి మధ్య జరిగే గట్టి పోరును సూచిస్తోంది. సుహాస్ ఈ చిత్రంలో బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
 
ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అద్భుత నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రీడా నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, బలమైన భావోద్వేగాలు, సంకర్షణలతో కూడిన ఈ సినిమా జీవన పోరాటం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
 
కథను బలంగా ముందుకు నడిపించడంలో టాప్-టియర్ సాంకేతిక బృందం కీలకపాత్ర పోషిస్తోంది: సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్ సమకూరుస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా ఎస్.ఆర్. కతిర్ ఐ.ఎస్.సి. పని చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్. యాక్షన్ కొరియోగ్రఫీని లెజెండరీ పీటర్ హెయిన్, సౌండ్ డిజైన్‌ను ప్రతాప్ అందిస్తున్నారు. ఆర్. హరిహర సుతాన్ VFX బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు