హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు విజయ్ దేవరకొండ, గిరిజనుల గురించి మాట్లాడుతూ,"500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారు" అని వ్యాఖ్యానించారు. మా జాతి బిడ్డలను పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చి, గిరిజనుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం. నవోదయం పార్టీ (తెలంగాణ) తీవ్రంగా ఖండిస్తుంది. సినీ నటుడు విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.
నవోదయం పార్టీ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ శివశంకర్ పటేల్ ఓ ప్రకటనలో నేడు పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లోని సినిమా వారికి కేటాయించిన చిత్రపురి కాలనీలో చాలా అవకతవకలు జరిగాయనీ, నిన్ననే దీక్ష చేపట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకే ఆదివారంనాడు రిలే నిరాహారదీక్ష చేపటనున్నట్లు పేర్కొంటున్నారు.