ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన "జైభీమ్"

గురువారం, 20 జనవరి 2022 (12:15 IST)
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - దర్శకుడు టీజే జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "జైభీమ్". గత యేడాది ఓటీటీలో విడుదలైంది. ఇప్పటికి 75 రోజులు పూర్తి చేసుకుంది. ఒక చిత్రం ఓటీటీలో ఇన్ని రోజుల పాటు విజయవతంగా స్ట్రీమింగ్ కావడం కూడా చాలా అరుదుగా జరిగే విషయమని పలువురు అభిప్రాయపడుుతున్నారు. 
 
ఈ చిత్రంలో హీరో సూర్య అడ్వకేట్ చంద్రూ పాత్రలో కనిపించారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి చంద్రూ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే, మలయాళ నటి లిజోమోన్ జోస్ సినతల్లి పాత్రలో జీవించారు. ముఖ్యగా, ఈ చిత్రం మొత్తం లిజోమోన్ నటనే హైలెట్. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరజనాలు పలికారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు కళ్ళకుకట్టినట్టు తెరకెక్కించారు. 
 
అయితే, ఈ చిత్రం ఆస్కార్ అకాడెమీకి చెందిన అధికార యూట్యూబ్ చానెల్‌లో ఈ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను అప్‌లోడ్ చేసింది. దాదాపు 12 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోలో దర్శకుడు టీజే జ్ఞానవేల్ మాటలు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్లకు సంబంధించిన వీడియో ఆస్కార్ అకాడెమీ అధికారిక యూట్యూబ్ చానెల్‌లో ప్రసారం కావడం ఆసక్తికరంగా మారింది. 
 
ఇప్పటివరకు ఏ ఒక్క తమిళ చిత్రానికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కలేదు. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది తమిళ సినిమాకే కాదు ఇండియన్ సినిమా అంతటికీ ఇది గర్వకారణమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు