సుశాంత్ కేసు : రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... మరో కేసు, ఏక్షణమైనా అరెస్టు

గురువారం, 27 ఆగస్టు 2020 (08:10 IST)
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఇపుడు కీలక మలుపుతిరిగింది. ముఖ్యంగా ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 
 
రియా చక్రవర్తి డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్.. సుశాంత్ కేసులో మాదకద్రవ్యాల మాఫియా ప్రమేయాన్ని బహిర్గతం చేసింది. దీంతో.. రియా చక్రవర్తికి, డ్రగ్స్ మాఫియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది.
 
ముఖ్యంగా, డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ చాటింగ్ చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చాట్‌ను తన ఫోన్ నుంచి రియా డిలీట్ చేసినా... అధికారులు దాన్ని తిరిగి పొందారు. రియాకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది.
 
మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం బయటపడటంతో ఈ కేసులో మాదకద్రవ్యాల కుట్ర కూడా ఉందనే అనుమానం రేకెత్తింది. సీబీఐ దర్యాప్తులో రియాకు సంబంధించిన కీలక విషయాలను సుశాంత్‌ స్నేహితుడు పితాని సిద్ధార్థ్‌ వెల్లడించాడు.
 
గత జూన్‌ 8వ తేదీన సుశాంత్‌తో రియా చక్రవర్తి గొడవపడిందని అతను విచారణలో బయటపెట్టాడు. జూన్ 15న సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. సుశాంత్‌ నివాసంలో ఆధారాలు దొరక్కుండా 8 హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేశారని, ఆసమయంలో సుశాంత్‌ మేనేజర్‌ దీపేష్‌, వంటమనిషి ధీరజ్‌ ఉన్నారని సిద్ధార్థ్‌ చెప్పాడు. 
 
హార్డ్‌ డిస్క్‌ల్లో ఏముందో తనకు తెలియదని సిద్ధార్థ్ విచారణలో తెలిపాడు. రియా సమక్షంలోనే హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసం జరిగినట్లు సీబీఐకి ఆధారాలు లభించాయి. దీంతో.. డ్రగ్స్‌ లింకుతో రంగంలోకి దిగిన నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బోర్డు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు