ఈ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథ ని రాశారు. ఇందులో విజయ్ సేతుపతి క్యారెక్టర్ సరికొత్తగా వుండబోతోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్, చార్మి కౌర్ త్రయం ఆనందం, ఉత్సాహం సినిమా పట్ల వారి ఎక్సయిట్మెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ పాన్-ఇండియా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.