వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

దేవీ

గురువారం, 20 మార్చి 2025 (15:43 IST)
Rahul Reddy
ఫాంటసీ, మ్యాజికల్‌ అంశాలతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం 'టుక్‌ టుక్‌'. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్‌ కృష్ణ దర్శకుడు. మార్చి 21న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత  రాహుల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలివి.
 
మీ నేపథ్యం?
ఐటీ మల్టీపుల్‌ కంపెనీలో పనిచేస్తుండేవాడిని, ఆ తరువాత యానిమేషన్‌ స్టూడియో స్టార్ట్‌ చేశాను. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయమైన దర్శకుడు సుప్రీత్‌తో కలిసి మొదటగా అలనాటి చిత్రాలు అనే వెబ్‌సీరిస్‌ చేశాను. నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్‌ కూడా ఉండటంతో థియేటర్‌సినిమా చేయాలని అనుకున్నాను. సుప్రీత్‌ చెప్పిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌ నచ్చడంతో 'టుక్‌టుక్‌ చిత్రాన్ని స్టార్ట్‌ చేశాను. కంటెంట్‌ నచ్చడంతో అందరూ కలిసి, నేను యానిమేషన్‌లో కూడా ఉండటంతో.. ఈ పాంటసీ కథతో టుక్‌టుక్‌ కథను ప్రారంబించాం. దీనినే ఫ్రాంఛైజీ. కంటెట్‌తో పాటు కమర్షియల్‌ అంశాలు
 
టుక్‌టుక్‌పై మీకున్న నమ్మకం ఎలాంటింది?
కంటెంట్‌ ఉంటే ప్రేక్షులు ఆదిరిస్తారు అనేది నానమ్మకం, ఏ భాషలోనైనా కొత్తదనం కూడా ఆదరిస్తారు కంటెంట్‌ నచ్చితేనే కమర్షియల్‌ హిట్‌లుగా నిలుస్తాయి. ప్రొడ్యూసర్‌గా నా నమ్మకం అదే.
 
టుక్‌టుక్‌ టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి?
టుక్‌ టుక్‌ అంటో త్రీవీల్డ్‌ ఆటోను అంటారు. సినిమాలో టుక్‌ టుక్‌ ఆటో కీలక పాత్ర పోషించింది. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం.
 
సినిమాలో ఆర్టిస్ట్‌లను కూడా  పాత్రలకు ఎవరి సెట్‌ అయితే వాళ్లనే తీసుకున్నాం.
 
టుక్‌ టుక్‌లో కీలక పాత్ర పోషించిన రోషన్‌ మీ సినిమాకు ఎంత వరకు ప్లస్‌ అవుతుంది?
కోర్టు సినిమా హిట్‌ అవ్వడం మా సినిమాకు మంచి శుభారంభం. ఈ సినిమాతో కూడా రోషన్‌కు కూడా మంచి పేరు వస్తుంది. తప్పకుండా కోర్టు హిట్‌ అవ్వడం చాలా ప్లస్‌ అవుతుంది. మా సినిమాకు కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ వుంది.
 
టుక్‌ టుక్‌లో ప్రధాన అంశాలు ఏమిటి?
ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, ఫాంటసీ, థ్రిల్లింగ్‌ అన్ని అంశాలు ఉంటాయి. ప్రేక్షకులను రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తుంది.ఎక్కడ కూడా బోర్‌ కొట్టదు.
 
దర్శకుడు సుప్రీత్‌తో ఈ సినిమా చేయడానికి కారణం?
సుప్రీత్ చెప్పిన కథ బాగా నచ్చింది మా థింకింగ్‌ కూడా సిమిలర్‌గా ఉంటుంది. మా ఇద్దరి ఆలోచనలు, ఒకేలా ఉంటాయి. అతని మీద చేయగలడు అనే నమ్మకం ఉంది. మా నమ్మకాన్ని నిలబెట్టాడు.
 
ఈ చిత్రంలో ఉన్న మ్యాజికల్‌ ఎలిమెంట్ష్‌ గురించి?
వెహికల్‌లో  ఉన్నా మ్యాజికల్‌ ఎలిమెంట్స్‌కు ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారు. టీజర్‌, ట్రైలర్‌ చూడగానే అందరిలో ఆసక్తి ఉంది. అసలు ఇది పాంటసీనా, హారర్‌ అనే ఆసక్తి ఉంది. అందరికి  సినిమాలో ఏముంది అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
 
సినిమా విడుదలకు ముందే అన్ని హక్కులు అమ్మేశారని తెలిసింది?
సినిమా విడుదలకు ముందే డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ హక్కులకు మంచి ఫ్యాన్సీ రేట్‌ వచ్చింది. థియేట్రికల్‌ రిలీజ్‌ కూడా ఎంతో శాటిస్‌ఫాక్షన్‌గా చేస్తున్నాం.
 
మీరు ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు?
ఈ రిజల్ట్‌ను బట్టి.. ఇదే కాంబినేషన్‌లో ఇంకా బెటర్‌ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. అన్ని జానర్‌ సినిమాలు టచ్‌ చేయాలని ఉంది. టుక్‌టుక్‌ను ఫ్రాంఛైజీలా చేయాలనే ఆలోచన ఉంది. ఈ సినిమాలో ఆ లీడ్‌ను కూడా వదిలేశాం.
 
ఈ సినిమా చూసిన వాళ్ల నుంచి ఏమైనా ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందా?:
ఆల్‌రెడీ సినిమా చూసిన వాళ్లు మంచి ఫీడ్‌బ్యాక్‌ ఉంది. ఓటీటీ , శాటిలైట్‌ వాళ్లు చూసి ఆ హక్కులను తీసుకున్నారు. దీంతో సినిమా విజయంపై మాకు మరింత నమ్మకం పెరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు