తెలుగు సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి ఇకలేరు

శనివారం, 12 మార్చి 2022 (17:34 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదకర ఘటన జరిగింది. ప్రముఖ సినీ గేయరచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. స్థానిక హైదరాబాద్, వెంగళరావు నగరులోని ఆయన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లప్లె. గత 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "ఇట్లు శ్రావణి, సుబ్రహ్మణ్యం" అనే చిత్రంలో చక్రీ సంగీత సారథ్యంలో 'మళ్లీ కూయవే గువ్వా' అనే పాటతో ఆయన సినీరంగంలోకి అడుగుపెట్టారు. 
 
ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో ఆయన సినీ గేయరచయితగా కొనసాగుతూ వచ్చారు. గత 20 యేళ్ల ప్రస్థానంలో సుమారుగా 1300 వరకు పాటలు రాశారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలను రాశారు. ఆయన మృతి వార్తను తెలుసుకున్న సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు