ఉప్పెన హీరోయిన్‌కి బంపర్ ఆఫర్. ఇంతకీ ఏంటా ఆఫర్..?

గురువారం, 19 మార్చి 2020 (11:17 IST)
ఉప్పెన సినిమాతో మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తో పాటు కథానాయికగా కృతి శెట్టి కూడా పరిచయం అవుతుంది. అలాగే ఈ సినిమా ద్వారా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
 
ఇటీవల ఆ సినిమా నుంచి రిలీజ్ చేసిన నీ కన్ను నీలి సముద్రం పాటలో కృతి శెట్టిని చూసిన కుర్రకారు పొలోమంటూ మనసులను పోగొట్టుకున్నారు. అమ్మాయి నవ్వుకు .. గమ్మత్తయిన ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా అయ్యారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
 
ఏప్రిల్ 2న ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా ఎనౌన్స్ చేసారు. అయితే.. ప్రస్తుత ఏర్పడిన పరిస్థితుల దృష్టా మార్చి 31 వరకు సినిమా హాల్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 
 
మార్చి 31 వరకేనా లేక పొడిగిస్తారా అనేది తెలియదు. మార్చి 31 వరకే అయితే... ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 2న ఉప్పెన థియేటర్స్ లో వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అర్జున్ సురవరం సినిమాతో సక్సస్ సాధించి మళ్లీ సక్సస్ ట్రాక్ లోకి వచ్చిన యువ హీరో నితిన్. ఈ సినిమా తర్వాత కార్తీకేయ 2 సినిమాని స్టార్ట్ చేసాడు. 
 
ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇటీవల స్టార్ట్ చేసిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. నిఖిల్ మరో సినిమా స్టార్ట్ చేసాడు. టాలీవుడ్ బడా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మాతగా రూపొందే చిత్రంలో హీరోగా క్రేజీ ఆఫర్ దక్కించుకున్నాడు నిఖిల్.
 
ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్నారు. దీనికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి వెరైటీగా 18 పేజీలు అనే టైటిల్ ఖరారు చేసారు. 2015లో సుకుమార్ కథతో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన చిత్రం కుమార్ 21 f. ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. 
 
రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిన్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. సుమారు నాలుగేళ్ల తరువాత సుకుమార్, సూర్య ప్రతాప్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
 
దీనికి తోడు గీతా ఆర్ట్స్‌ ద్వారా అల్లు అరవింద్ భాగస్వామ్యం కావడం.. అర్జున్ సురవరంతో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్ర అఫీషియల్ అనౌన్స్ మెంట్‌తోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
 
 అయితే.. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఎనౌన్స్ చేయలేదు. తాజా వార్త ఏంటంటే... ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నటించిన కృతి శెట్టి ఇండస్ట్రీలోని మిగతావారి దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ అమ్మడు సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న 18 పేజీలు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
 
ఉప్పెన సినిమా పాటలో ఆమె ప్రదర్శించిన అభినయం నచ్చడంతో సుకుమారే... ఈ సినిమాకి కృతి శెట్టి పేరును సిఫార్స్ చేశాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి నిఖిల్ జోడీగా ఈ అమ్మడు ప్రమోషన్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాతో పాటు మరి కొన్ని క్రేజీ, భారీ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నట్టుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈవిధంగా ఈ అమ్మడు ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే భారీ, క్రేజీ మూవీస్ లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందని టాక్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు