విజయ్ దేవరకొండ ఎక్కడ ? ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ అంతా దిల్రాజు భుజాలపై మోస్తున్నాడు

డీవీ

శనివారం, 6 ఏప్రియల్ 2024 (10:40 IST)
dilraju, mrunali,parasuram
ఫామిలీ స్టార్ సినిమా ప్రమోషన్ లో విజయదేవరకొండ మిస్ అయ్యాడు. సినిమా విడుదలకు ముందే తను అమెరికా వెళ్ళనట్లు సన్నిహితులు తెలియజేస్తున్నారు. అందులో రష్మిక బర్త్ డే వేడుకలో పాల్గొన్నాడని ఇండస్ట్రీ టాక్. అందుకే చేసేదిలేక నిర్మాత దిల్ రాజు ప్రమోషన్ తన భుజాలపై వేసుకున్నారు.. రిలీజ్ ముందు.. సోషల్ మీడియాలో ఉన్న దాదాపు అన్ని గ్రూప్ లతో మీటింగ్ వేసి వారిని ప్రమోషన్ కు వినియోగించుకున్నారు. ఫైనల్గా రెగ్యులర్ మీడియా ఫ్యామిలీతో గెట్ తో గెదర్ పెట్టి తను హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. 
 
శుక్రవారం విడుదలైన సినిమా రిపోర్ట్ గురించి దిల్ రాజు.. ఇలా స్పందించారు. నిన్న మీడియా మిత్రుల కుటుంబాలతో కలిసి మా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించాం. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశాం. ఉదయం నాలుగు గంటల నుంచే యూఎస్ నుంచి మెసేజ్ స్ రావడం మొదలైంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా థియేటర్స్ కు వెళ్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లో మార్నింగ్ ఏడున్నరకు షోస్ మొదలయ్యాయి. నేను కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్ లో సినిమా చూశాను. 90 పర్సెంట్ యూత్ ఆడియెన్స్ థియేటర్ లో ఉన్నారు. నేను ఏ ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతారు అనుకున్నానో అదే జరిగింది. సినిమా మొదలైన పది నిమిషాల వరకు ప్రేక్షకులు సైలెంట్ గా ఉన్నారు. మృణాల్ ఎంట్రీ నుంచి రెస్పాన్స్ మొదలైంది. మరికాసేపటికి సినిమాలో వాళ్లంతా ఇన్వాల్వ్ అయి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. యూఎస్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో ఫస్టాఫ్ సూపర్బ్ గా ఉంది. సెకండాఫ్ కొంతసేపు స్లోగా ఉంది, ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ చాలా బాగుందని చెప్పారు. కానీ హైదరాబాద్ లో నేను చూస్తున్నప్పుడు సినిమా మొత్తం ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సెకండాఫ్ లో విజయ్, మృణాల్ కాంబో సీన్స్ కూడా వారికి బాగా నచ్చాయి. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్ గా థియేటర్స్ కు వెళ్తున్నారు. మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయి. సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. వాళ్లలో 90 పర్సెంట్ మందికి ఫ్యామిలీ స్టార్ బాగా నచ్చింది. 
 
అందుకే సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ మా టీమ్ కు సత్కారం చేస్తామంటే సంతోషంగా ఒప్పుకుని రమ్మని చెప్పాం. మేము ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మీడియాలో ఎలా యాక్సెప్ట్ చేస్తుందో వాళ్లు రివ్యూస్ లో ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. మీడియా షో చూశాక నాతో టచ్ లో ఉండే మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఫ్యామిలీతో ఫ్యామిలీ స్టార్ చూసి ఎంజాయ్ చేశామని చెప్పారు. మేము సినిమాలో బామ్మకు మనవడికి మధ్య చూపించిన ఎమోషన్, , బాబాయ్, పిల్లలు, అన్నాదమ్ముల మధ్య చూపించిన ఎమోషన్ ఆడియెన్స్ కు బాగా నచ్చుతోంది.

ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూడండి. మాకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో మీరూ అలాగే ఫీలవుతారు. ఈ సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ ను ఎంజాయ్ చేయండి. సినిమా చూశాక మీకు నచ్చితే మరో నలుగురికి చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే తమ ఫ్యామిలీని గొప్ప పొజిషన్ లోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్ ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి రేపటి నుంచి వారిని కలవబోతున్నాం. ఇప్పటికే ఇలాంటి మూడు ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేశాం. పర్సనల్ గా నేను, విజయ్, పరశురామ్, మృణాల్ వెళ్లి ఆ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేయబోతున్నాం. అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు