Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

దేవీ

శుక్రవారం, 21 మార్చి 2025 (10:45 IST)
Pellikaani Prasad sean
సప్తగిరి హోల్సమ్ ఎంటర్ టైనర్ 'పెళ్లి కాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించారు. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా ఈరోజు.. మార్చి 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్దార్థ్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: మధు
 
కథ:
 మలేషియాలో ప్రసాద్ (సప్తగిరి) ఓ హోటల్ లో పని చేస్తూ ఉంటాడు. అతని తండ్రి (మురళీధర్).  తమ పూర్వీకుల చరిత్ర కొడుక్కు చెప్పి రెండు కోట్లు తక్కువైనా పెండ్లిచేసుకోకూడదని కండిషన్ పెడతాడు. ఈ కండిషన్ కు అంగీకరించే అమ్మాయి వస్తుందానే కోణంలో ఆలోచిస్తుండగా  అదే ఊరిలో ఉండే ప్రియ ( ప్రియాంక శర్మ) పరిచయం అవుతుంది. ఆమె  ఫారిన్ లో సెటిల్ అవ్వాలని ముందు నుంచి కలలు కంటూ ఉంటుంది. 
 
అందుకు ప్రసాద్ ను ఉపయోగించుకోవాలనుకుంటుంది. అందుకోసం ప్రసాద్ ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. కానీ ఇక్కడో ట్విస్ట్ ఇస్తాడు ప్రసాద్. అది ఏమిటి? అసలు రెండు కోట్ల కథ ఏమిటి? ప్రసాద్ ను ట్రాప్ చేసినా ప్రియ కోరిక నెరవేరిందా? లేదా అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
పెళ్లి చుట్టూ అల్లిన కథలు పలు వచ్చాయి. అయితే కమేడియన్ టర్న్ సప్తగిరి చేయడం తో కొంచెం విశేషంగా వుంది. అమాయకత్వం కూడిన పాత్రలా కనిపిస్తూ అని పడే బాధలు ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేయిస్తాయి. ప్రసాద్ ను ప్రియ ట్రాప్ చేసి పెండ్లి చేసుకోవాలనుకునే క్రమంలో సాగే కథనం ఆసక్తిగా అనిపిస్తుంది.  కొన్ని చోట్ల కామెడీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించిన కొన్ని చోట్ల మాత్రం ఆకట్టుకునేలా వుంది.  అక్కడా చిన్న పాటి లోపాలున్నాయి. ముగింపుకు ముందు ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 
 
హీరోగా పాత్రపరంగా సప్తగిరి మొత్తం తన భుజాన వేసుకున్నాడనే చెప్పాలి. వన్ మాన్ ఆర్మీగా నవ్వించే బాధ్యతలు తీసుకున్నాడు. వయసు పైపడుతున్న ఇంకా పెళ్లి కాక, తండ్రిని ఎదిరించలేక ఇబ్బంది పడే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అయితే తర్వాత ప్రేమలో పడటం ఆ ప్రేమలో కూడా ఆమె స్వార్థం తెలుసుకున్న పాత్రపరంగా సప్తగిరి బాగా హావభావాలు పలికించాడు. ఆ తర్వాత పాత్ర మురళీధర్ గౌడ్ ది. ఇప్పటికే పలు సినిమాలతో ప్రూవ్ చేసుకున్న ఆయన ఈ సినిమాలో మరోసారి ఆకట్టుకున్నాడు. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ ఆకట్టునేల ఉంది. మిగతా నటీనట్లు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 
 
సాంకేతికపరంగా సంగతదర్శకుడు శేఖర్ చంద్ర అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా చాలా సీన్స్ లో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా వాడిన మీమ్ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని సాంగ్స్ చిత్రీకరణ చాలా బాగుంది. చాలా డైలాగ్స్ నవ్విస్తూనే ఆలోచింపచేసేలా ఉన్నాయి. దర్శకుడు సినిమాలో చక్కటి సందేశం ఇవ్వాలనుకున్నా సప్తగిరి కావడంతో పూర్తి వినోదాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. ఇప్పటి వినోదాత్మక సినిమాల్లో సన్నివేశాలపరంగా నవ్వించేలా చేయడమే పెద్ద ప్రక్రియ ఆ విషయంలో దర్శకుడు, హీరో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు