"శీనుగాడు మహాముదురు" ట్రైలర్

అందాల ముద్దుగుమ్మ శ్రియ, తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు ధనుష్‌ హీరోహీరోయిన్లుగా నటించి తమిళంలో విడుదలైన "తిరువిళ్లైయాడల్" అనే చిత్రం "శీనుగాడు మహాముదురు" పేరుతో తెలుగులోకి రానుంది. జి. భూపతి పాండ్యన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తుమ్మల గోపాలరావు సమర్పణలో శ్రీ సౌదామిని క్రియేషన్స్‌ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత చెబుతూ, 'లవ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ఉండే చిత్రమిదన్నారు. ధనుష్‌, ప్రకాష్‌రాజ్‌ నటన పోటాపోటీగా ఉంటుందని చెప్పారు.

శ్రియ గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కనే యువకుడు, తన ప్రేమను పణంగా పెట్టి లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశమని నిర్మాత వివరించారు. ఈ నెల పదోతేదీన తెరపైకి రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

వెబ్దునియా పై చదవండి