"శీనుగాడు మహాముదురు" ట్రైలర్

తమిళంలో "మళై" (తెలుగులో వర్షం రీమేక్) చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన శ్రేయ, ఆ తర్వాత "శివాజీ"లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించి స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

ఓ వైపు రజనీతో నటిస్తూనే రజనీ కాంత్ అల్లుడు "ధనుష్"తో శ్రేయ "తిరువిలైయాడల్ ఆరంభం" సినిమాలోనూ జత కట్టేసింది. తాజాగా ఈ అనువాద చిత్రాన్ని "శీనుగాడు మహాముదురు" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ సౌదామిని క్రియేషన్ బ్యానర్‌పై, కె.వి.వి. సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు.

తమిళంలో ధనుష్‌కు మంచి మాస్ అప్పీల్ ఉంది. శ్రేయకు గ్లామర్ క్వీన్ అనే పేరుంది. ఈ ఇద్దరు కలిసి నటించిన ఈ తమిళ చిత్రం మంచి విజయాన్ని సాధించిందని నిర్మాత తెలిపారు. ప్రేమ, వినోదం, యాక్షన్ వంటి అంశాలన్ని ఇందులో ఉన్నాయన్నారు. ఈ చిత్రానికి జి. భూపతి పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

వెబ్దునియా పై చదవండి