దివ్య వనం ఒకవైపు తీర్థ జలం మరోవైపు, నడుమ పాదఘట్టం అంటూ రామ్‌చరన్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ అందరూ సౌమ్యులు. పూజాలు, పునస్కారాలేకాదు. ఆపదొస్తే అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుందంటూ.. అదే ధర్మస్థలి.. అనే డైలాగ్ రావడం. ఆ తర్వాత యాక్షన్ సీన్స్ ఎక్కువగా చూపించారు. దీనిని బట్టి ఇది యాక్షన్ చిత్రంగా గోచరమవుతుంది.
కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్ని ఎంటర్ టైన్మెంట్ పతాకాల పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీత స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే చిరంజీవి 153వ చిత్రంగా 153 థియేటర్లలో ఈ ట్రైలర్ విడుదలైంది. చిరంజీవి, రామ్ చరణ్ డైలాగ్స్ ట్రైలర్‌లో ఆకట్టుకోగా, సోనూ సూద్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. . ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.