Kaliyuga pattanamlo Trailer event
‘వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు.. మెంటల్ హాస్పిటల్‌లో’ అంటూ సాగే ఈ ట్రైలర్‌లో యాక్షన్, లవ్, క్రైమ్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాలను చూపించారు. నంద్యాలలో జరిగే హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. నల్లమల ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను అల్లుకుని కథను రాసినట్టుగా కనిపిస్తోంది.‘ ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదమ్మా’ అని హీరో చెప్పే ఎమోషనల్ డైలాగ్ బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కలియుగం పట్టణంలో ట్రైలర్ విడుదలైంది.