దసరా ముగింపు ఉత్సవాల్లో భాగంగా, రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. దీన్ని తిలకిస్తున్న ప్రజలపై రైలు ఒకటి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయారు. దీనిపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. అమృతసర్ ప్రమాదంలో ప్రజలపై నుంచి దూసుకెళ్లిన జలంధర్ రైలు డ్రైవర్‌పై ఎటువంటి చర్య తీసుకోబోమని రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా స్పష్టం చేశారు.
అలాగే, భవిష్యత్తులో ఇటువంటి ఉత్సవాలను రైలు పట్టాలకు సమీపంలో నిర్వహించవద్దు. ఇటువంటి వేడుకలు నిర్వహించేటప్పుడు అనుమతులు మంజూరు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుంది. కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విభాగం ఈ ఘటనపై అంతర్గత విచారణ చేపడుతుంది అని తెలిపారు.