బ్యాంకులు వరసగా 6 రోజులు బంద్, డబ్బు లావాదేవీలు ముందుగా చూస్కుంటే బెటర్...

బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (12:17 IST)
బ్యాంకులకు వరుసగా 6 రోజులు సెలవులు రాబోతున్నాయి. అదేంటంటారా... దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని లక్షలాది మంది ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మె చేయడంతో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోమారు తమ డిమాండ్ల కోసం మార్చి నెల రెండో వారంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టనుండటంతో బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. 
 
మరోవైపు సమ్మెకు ముందు రోజు హోళీ పండుగ, సమ్మె తర్వాత రెండో శనివారం, ఆదివారం కూడా రావడంతో వరుసగా బ్యాంకులు ఆరు రోజుల పాటు పనిచేయవు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగేది మూడు రోజులే అయినా మార్చి 10 నుంచి 15 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఐతే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర ప్రైవేటు బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు