అప్పుడు కొందరు పిల్లలు భయంతో కేకలు వేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లగా పొడవాటి చెట్ల మధ్య గ్యాప్‌లోకి జారకుండా పోయింది. అధిక బరువు ఉన్నప్పటికీ అది అసమానమైన పైకప్పుల మీదుగా, చెట్ల మధ్య ఎలా నడుస్తుందోనని ప్రజలు ఆశ్చర్యపోయారు. కార్పెట్ కొండచిలువలు 15 కిలోల వరకు బరువు, 15 అడుగుల (5 మీటర్లు) పొడవు వరకు పెరుగుతాయి.
సాధారణంగా ఇవి నేలపై కనిపించినప్పటికీ, అవి అప్పుడప్పుడు చెట్టు నుండి చెట్టుకు దాటడం ఆస్ట్రేలియాలో సాధారణం. అవి వేటాడేందుకు పక్షి కోసం వెతుకుతున్నాయని లేదా నీడలో దాక్కుంటాయట. ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.