హీ ఈజ్ బ్రేవ్, హీ ఈజ్ హానెస్ట్, హీ ఈజ్ మై బ్రదర్: RRR చెర్రీ లుక్ పైన NTR

శుక్రవారం, 26 మార్చి 2021 (17:04 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ చెర్రీ అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చేసింది. రామ్ చరణ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్ ఇచ్చింది యూనిట్. ఈ చిత్రంలో రామరాజు లుక్‌ను రిలీజ్ చేసి అభిమానులను మజా చేశారు. చెర్రీ లుక్ చూసి ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు.
 
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజుగానూ, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు.

He's brave.
He's honest.
He's righteous.
Here’s my brother @AlwaysRamCharan in his fiercest avatar as #AlluriSitaRamaraju#RRR #RRRMovie @ssrajamouli @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/vZISd66yCQ

— Jr NTR (@tarak9999) March 26, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు