బీజేపీ నేత సోదరుడి ఓవరాక్షన్.. లేచి నిలబడి మర్యాద ఇవ్వలేదని? (వీడియో)

శుక్రవారం, 7 జూన్ 2019 (15:16 IST)
కొందరు బీజేపీ నేతల నోటిదురుసు, చేతివాటం సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ బీజేపీ నేతకు సోదరుడు కూడా ఓవరాక్షన్ చేశాడు. ఓ మెడికల్ షాపుకు వెళ్లిన బీజేపీ నేత సోదరుడు.. ఆ మందుల షాపులో పనిచేసే వ్యక్తిపై చేజేసుకున్నారు. ఇందుకు కారణం ఆ షాపు వ్యక్తి లేచి నిల్చుని మర్యాద ఇవ్వకపోవడమే. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. 
 
ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. బీహార్‌ మాజీ మంత్రి, ఆ రాష్ట్ర  బీజేపీ ఉపాధ్యక్షుడిగా వున్న రేణు దేవికి పిను అనే సోదరుడు వున్నారు. ఇతడు పెటయా అనే ప్రాంతంలోని ఓ మెడికల్ షాపుకు మందులు కొనేందుకు వెళ్లాడు.
 
ఆ సమయంలో ఆ షాపులోని ఉద్యోగి బినుకు లేచి నిలబడి మర్యాద ఇవ్వలేదట. దీంతో ఆగ్రహానికి గురైన పిను ఆ ఉద్యోగిపై చేజేసుకున్నాడు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న వాగ్వివాదం, పిను దురుసు ప్రవర్తనకు సంబంధించిన సన్నివేశాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. 
 
దీనిపై బీజేపీ నేత రేణు మాట్లాడుతూ.. ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. పిను కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వారితో మాటల్లేవని.. వారి కుటుంబానికి తాను దూరంగా వున్నట్లు తేల్చి చెప్పేశారు. పిను ఓవరాక్షన్ చేశారని.. ఇలాంటి ఘటనలకు తాను మద్దతు ప్రకటించబోనని తేల్చేశారు. తప్పుచేసిన వారికి శిక్ష తప్పకుండా పడాల్సిందేనని రేణు వ్యాఖ్యానించారు. 

Bihar BJP minister's brother thrashes chemist for 'not standing up'

Read @ANI Story | https://t.co/amd9AaQbNK pic.twitter.com/mvtV9Rny1V

— ANI Digital (@ani_digital) June 6, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు