ప్రేమికుల రోజు: మీ ప్రేమ మూడు నెలల్లోనే బోర్ కొట్టేసిందా?
మంగళవారం, 5 ఫిబ్రవరి 2013 (12:31 IST)
FILE
ప్రేమికుల రోజున తమ ప్రేమను వ్యక్తీకరించి ప్రేయసి మదిని దోచేయాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రేమికులకు కొన్ని టిప్స్. ప్రేమించిన కొద్దిరోజులే ప్రేమలోని మధురత్వాన్ని ఆస్వాదించే కొందరు.. ప్రేమించిన మూడు, నాలుగు నెలల్లో బోర్ కొట్టేసినట్లైతే.. అదే ప్రేమ విఫలమయ్యేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుచేత ప్రేమికుల రోజున మొదలయ్యే ప్రేమైనా సరే... ఇప్పటికీ కొనసాగుతున్న లవ్వాయణం అయినా సరే.. ఈ సూచనలు పాటిస్తే.. మీ ప్రేమ జీవితాంతం చిరస్థాయిగా మిగిలిపోతుంది.
1. ప్రేమంటేనే రోజా, క్యాండిల్, చాక్లెట్లనే గాకుండా.. మీ ప్రేయసి/ ప్రియుడికి నచ్చిన వస్తువులు, అలవాట్లు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రేయసి/ ప్రియుడికి నచ్చని విషయాలు కూడా తెలుసుకోండి.
2. ప్రేమ లేని లోకం శూన్యం అన్నట్లు.. మీ ప్రేయసి/ ప్రియుడిని ఎలా ఆకట్టుకోవాలనే దానిపై దృష్టిపెట్టండి. మీ ప్రేమను వ్యక్తీకరించే విధానం కొత్తగా ఉండేలా చూసుకోండి.
3. మొదటి ప్రేమ విఫలమైతే ఆ ప్రేమ సాకుగా రెండోసారి మీ ప్రేయసిని ఆకట్టుకోవచ్చు. ప్రేమ ఆరంభంలో కొత్తగా ఉంటుంది. అదే మీ ప్రేమ ఉద్వేగం, ఉత్సాహంతో చివరి వరకు కొనసాగాలంటే ఐ మిస్ యూ, ఐ లవ్ యూ మెసేజ్‌లు సందర్భానుసారంగా ఇవ్వాలి.
4. ఇంకా అప్పుడప్పుడు చిలిపి చేష్టలతో రొమాన్స్, ముద్దులతో కూడిన గిఫ్ట్‌లను మీ ప్రేయసి లేదా ప్రియుడికిచ్చి ఆశ్చర్యపరచాలి. ప్రేమ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం.. భవిష్యత్ కార్యాచరణపై ఒకరితో ఒకరు చర్చించుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. ప్రేమికులే జీవితభాగస్వాములుగా కావాలంటే.. వారి టాలెంట్‌ను అప్పుడప్పుడు కొనియాడుతూ ఉండాలి. వారి కోసమే మీరు జీవిస్తున్నట్లు తెలియజేయాలి.