పాకిస్థాన్‌లో 13ఏళ్ల బాలిక హత్య.. చాక్లెట్ దొంగలించందనే డౌట్‌తో కొట్టి చంపేశారు..

సెల్వి

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (16:08 IST)
పాకిస్థాన్‌లో 13ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఇందుకు కారణం ఏంటంటే.. ఇంట్లో చాక్లెట్ దొంగలించడమే. అది కూడా ఇంట్లో చాక్లెట్ దొంగింలించిందనే అనుమానంతో బాలికను తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయిందని టాక్ వస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లో 13 ఏళ్ల బాలికను హత్య చేశారనే అనుమానంతో ఒక జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్ర అనే బాలికపై చాక్లెట్ దొంగలించిందని తీవ్రంగా కొట్టారు. 
 
గాయాలతో ఆస్పత్రిలో చేరిన కాసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బాలికను తీవ్రంగా హింసించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు