క్యాలీ ఫ్లవర్ రైస్ గర్భిణీలకు ఎంతో మేలు... ఎలా చేయాలో తెలుసా?

గురువారం, 14 మార్చి 2019 (20:49 IST)
కాలీఫ్లవర్ పోషకాలు అధికంగా ఉన్న వెజిటేబుల్. ఇందులో విటమిన్ సి, కెలు మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి బ్లడ్ సర్కులేషన్‌కు సహాయపడుతాయి. కాలీఫ్లవర్ గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైనవి. ఇది గర్భంలో బిడ్డ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా సహాయపడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కాలీప్లవర్‌ని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం చాలా అవసరం. మరి ఇన్ని ఆరోగ్యప్రయోజనాలున్న కాలీఫ్లవర్ కూరలాగా కాకుండా కాలీప్లవర్ రైస్ చేయడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు
కాలీప్లవర్... 2 కప్పులు,
బియ్యం....2 కప్పులు
పచ్చిబఠైణీలు..... అర కప్పు, 
పచ్చిమిర్చి... 5(సన్నగా తరిగినవి)
జీలకర్ర- పావు టీ స్పూను, 
అల్లం, వెల్లుల్లి పేస్టు.... పావు టీస్పూను
గరం మసాలా - పావు టీస్పూను,
కొత్తిమీర తరుగు - ఉప్పు రుచికి సరిపడా
నూనె: తగినంత
 
తయారు చేయువిధానం: 
1. ముందుగా అన్నం వండిపెట్టుకోవాలి.
2. తర్వాత పాన్‌లో కొద్దిగా నీళ్ళు, పసుపు మరియు ఉప్పు వేసి అందులోనే కాలీఫ్లవర్ కూడా వేసి 10 నిముషాలు ఉడికించుకోవాలి. 10 నిముషాలు ఉడికిన తర్వాత నీరు వంపేసి కాలీఫ్లవర్‌ను పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు తిరిగి ఆ కాలీఫ్లర్‌ను మంచి నీటిలో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ చల్లారిన తర్వాత నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. 
 
4. పాన్‌లో కొద్దిగా నూనె వేసి అందులో కాలీఫ్లవర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
5. మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పచ్చిబఠానీలు వేసి ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న కాలీఫ్లవర్‌ను వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి వేగిన తర్వాత అందులోనే రైస్ వేసి ఐదు నిమిషాలు ఫ్రై చేసి నాలుగు కప్పులు నీళ్లు పోసి ఉడికించాలి.
7. మొత్తం మిశ్రమం కలగలిసేటప్పుడు పావు చెంచా గరం మసాలా వేయాలి. 
8. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే... టేస్టీ కాలీఫ్లవర్ రైస్ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు