హైదరాబాదు మహా నగరంలో గణేశ్ విగ్రహాల తయారీ ముమ్మరం

బుధవారం, 5 ఆగస్టు 2020 (18:31 IST)
ప్రతి ఏడాది నిర్వహించే ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను ఈ ఏడాది కూడా మొదలు పెట్టారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ విశిష్ట గణపతి తయారీ పనులు ప్రారంభించినట్లు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు.
 
ఈ ఏడాది మహా విష్ణువు రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్ మహాగణపతిని కేవలం 9 అడుగులు ఎత్తులో మట్టితో తయారు చేస్తున్నామని తెలిపారు. 66వ ఏట రూపొందిస్తున్న ఖైరతాబాద్ గణనాథుడికి శ్రీ ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా నామకరణం చేసారు. ఈ విగ్రహానికి ఓవైపు లక్ష్మీదేవి మరోవైపు సరస్వతీ దేవి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
 
ఈ విగ్రహాలు మట్టితో తయారుచేసి, అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యావరణ రహితంగా ఖైరతాబాద్ గణనాథుడిని నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో భక్తులు ఎవ్వరూ రావద్దని... ఆన్లైన్ ద్వారా దర్శనం చేసుకోవాలని గణేశ్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.
 
ఇక ప్రతి ఏడాది ఆగస్టు నెల వచ్చిందంటే చాలు నగరం అంతా వినాయకుల మండపాలతో, సందళ్లతో నిండిపోతాయి. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో అన్ని పండుగులను ఇండ్లలోనే చేసుకున్నట్లుగానే ఆ గణనాథుని కూడా ఇంట్లోనే నిలుపుకొని పూజించాలని అధికారులు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు