అప్పుడు గర్భం దాల్చితే మహిళలకు కష్టం... అందుకని...

శుక్రవారం, 21 జూన్ 2019 (21:08 IST)
మహిళలు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సులో ఫెర్టిలిటీకి అనువైంది. మహిళలు సాధారణంగా ఈ వయస్సులో ఆరోగ్యంగా వుంటారు. గర్భ సంబంధింత సమస్యలు ఈ వయస్సులో సాధారణంగా తలెత్తవు. బిడ్డ టీనేజ్‌కు వచ్చేసరికి వయస్సు ఎక్కువ గల తల్లిదండ్రులు కంటే ఈ వయస్సులో వారు అధిక శక్తితో ఉంటారు.
 
ముప్పైలలోకి అడుగు పెట్టేకొద్దీ వారి ఫెర్టిలిటీ శాతం తగ్గడం ఆరంభిస్తుంది. ముప్పై నలభైల మధ్యకు వచ్చే సరికి గర్భం దాల్చడం క్లిష్టంమవుతుంది. 35 సంవత్సరాలు దాటిన వారికి గర్భస్రావాలు, బిడ్డ పుట్టుక లోపాలు ఎక్కువవుతాయి. డయాబెటిస్(గర్భధారణలో వచ్చేది) హైపర్ టెన్షన్, సమయం కంటే ముందే ప్రసవాలు వంటి సమస్యల శాతం కూడా పెరుగుతుంది.
 
అయితే, వైద్యశాస్త్ర పురోగతి దృష్ట్యా సరైన చికిత్సలు... జాగ్రత్తల వల్ల ఈ సమస్యల్ని అధిగమించవచ్చు. వయస్సు సంగతిని పక్కన వుంచితే, గర్భధారణకి ఆరోగ్యంగా వుండటమన్నది ప్రధానం. సంపూర్ణ ఆరోగ్యంతో వుంటే ఏ వయస్సులోనైనా గర్భం దాల్చవచ్చు. ఎవరికివారు తమ అవకాశాలు, అవసరాల్ని దృష్టిలో వుంచుకుని ప్లాన్ చేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు