కోడిగుడ్డును ఉడికించేటప్పుడు నీటితో పాటు రెండు డ్రాప్‌ల వెనిగర్ చేర్చితే, కోడిగుడ్లు పగులవు. వంట చేసేందుకు అరగంటకు ముందే బియ్యాన్ని, పప్పుల్ని నానబెట్టి ఉడికిస్తే అవి త్వరగా ఉడుకుతాయి. ఆవకాయ లేదంటే ఏదైనా ఊరగాయ తయారుచేసేటప్పుడు ఉప్పును కాస్త వేయించి చేర్చుకుంటే ఊరగాయలు చాలా రోజులకు నిల్వగా ఉంటాయి.