జాతకం

సింహం
సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆదాయం: 2 వ్యయం: 14, రాజపూజ్యం: 2, అవమానం 2 ఈ రాశివారి గోచారం పరిశీలించగా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వంటి చికాకులెదుర్కుంటారు. రుణదాతల ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పనుల్లో అంతరాయాలు, బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ కృషిలో ఓర్పు. చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు. సంతానం విద్యా విషయంలో ఒకింత నిరుత్సాహం తప్పదు. పత్రాల సవరణలు అనుకూలించవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యవసాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి నిరాశాజనకం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన ఈ రాశివారికి శుభం, జయం.

జనవరి-2024

సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం అనుకూలంగా ఉంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. మొండి బాకీలు వసూలవుతాయి, విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త....more

ఫిబ్రవరి-2024

సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహానికి గురవుతారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య తరచూ కలహాలు. సామరస్యంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం....more

మార్చి-2024

సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే. కార్యసాధనకు మనోబలం ముఖ్యం. ఆశావహదృక్పధంతో వ్యవహరించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు....more

ఏప్రియల్-2024

సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి విషయంలో పట్టుదలకు పోవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొంతమొత్తం....more

మే-2024

సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. కార్యసాధనకు సంకల్పసిద్ధి ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సోదరీ సోదరులతో విభేదిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని....more