నేలవేము ఆంధ్రదేశమంతటా పెరుగుతుంది. ఇది దాదాపు ఒక మీటరు పొడవు ఉండి నిటారుగా పెరిగి ఏక ద్వివార్షిక మొక్క. దీనిని తెలుగులో నేలవేము, సంస్కృతంలో బొనింబ అని పిలుస్తారు. ఇది ఆకాస్థేసి కుటుంబానికి చెందినది. దీని ఆకులు పచ్చిమిరపకాయ ఆకులను పోలి ఉంటాయి. దీని పువ్వులు చిన్నగా తెల్లగా ఊదారంగులో ఉంటాయి. నేలవేమును సమూలంగా వైద్యంలో వాడుతారు. జవరి నెలలో దీనిని పొందవచ్చును.
2. నేలవేము, తిప్పతీగె, కరాక్కాయ మొదలగు వానిని సమాన భాగాలుగా తీసుకుని రోజూ ఉదయం - సాయంత్రం 2-3 గ్రాముల చొప్పున తేనెతో సేవిస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి.
3. నేలవేము సమూలం, దాచుహరిద్రా 1/2 గ్రా, శొంఠి 1 గ్రా కలిపి కషాయంగా కాచి 30 మి.లీ. ఉదయం - సాయంత్రం సేవించిన కామెర్లు తగ్గుతాయి.