నల్లగా ఉన్నానని తెగ బాధపడిపోతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి. గంధాన్ని బాదం ఆయిల్‌తో కలిపి ముఖానికి పట్టించండి. ఈ ప్యాక్ ఎండిన వెంటనే కడిగేస్తే మీ చర్మం కోమలంగా తయారవుతుంది. అలాగే టమోటాను గుజ్జు చేసి అందులో 4-5 చుక్కలు నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే మీ చర్మం మృదువుగా ఉంటుంది.
ముఖాన్ని కడిగాక కొంచెం పాలును చేతుల్లోకి తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా 2-3 వారాలు చేస్తే మీ చర్మం కాంతివంతం అవుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. అలాగే కొంచెం కొబ్బరి బొండాంలోని నీటిని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే నలుపు రంగు మారుతుంది.
జీలకర్ర, ముల్లంగిని వేర్వేరుగా నీటిలో ఉడికించి ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు తొలగిపోతాయి. ఇంకా పుదీనా, నిమ్మరసాల్ని కూడా ముఖానికి రాసుకోవచ్చు.
కోడిగుడ్డులోని తెల్లసొనను వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకోవడం ద్వారా మీ చర్మం తెలుపుగా కోమలత్వంగా ఉంటుంది. అనాస పండు రసం, పుచ్చకాయ మరియు బొప్పాయి పండ్ల రసాలను కూడా ముఖానికి రాసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది.