సందర్భం ఏదైనా మేకప్ వేసుకుని మెరవాలనుకుంటారు మహిళలు. కళ్లకు ఐలైనర్, పెదాలకు చక్కని రంగు వేసుకుంటారు. మరి అలంకరణ సులువుగా తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు.
మేకప్ వేసుకున్న నిర్దేశిత సమయం తరువాత కచ్చితంగా దాన్ని శుభ్రం చేసుకోవాలి. అందుకోసం రసాయనాలే వాడనక్కర్లేదు. ఇంట్లో దొరిగే పాలు చాలు. పాలలో రెండు చుక్కల ఆలివ్ నూనెను కలుపుకుని ఆ మిశ్రమంలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
ఏ మేకప్‌నైనా సులువుగా తుడిచేయాలంటే తేనెలో కొద్దిగా వంటసోడాను చల్లి ఆ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం చర్మానికి తేమను, మృదుత్వాన్ని కోల్పోకుండా సహాయపడుతుంది. పూర్తయ్యాక చల్లని నీళ్లతో కడుక్కోవాలి.
వాటర్‌ఫ్రూఫ్ మేకప్‌ని తొలగించడం చాలా కష్టమే. ఇలాంటప్పుడు కొబ్బరినూనెలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని దూదితో తుడుచుకుంటే ఆ మేకప్ తొలగిపోతుంది.