వేసవికాలం వచ్చేసింది బాబోయ్.. ఈ కాలంలో మేకప్ వేసుకుంటే.. కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో వేడుకలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే సహజ అందానికి మేకప్ వేసుకోవడం తప్పనిసరే.. అయితే చెమట, ఉక్కబోత వంటి సమస్యల కారణంగా వేసుకున్న మేకప్ తొందరగా చెదిరిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం..
కొందరికైతే చర్మం ఎప్పుడూ జిడ్డుగానే ఉంటుంది. అలాంటివారు ముందు ఆయిల్ ఫ్రీ ప్రైమర్‌ని ముఖానికి రాసుకోవాలి. దీనిలో ఫేస్ ప్రైమర్, ఐ ప్రైమర్ అని విడివిడిగా ఉంటాయి. ముఖ్యంగా దేనికి దాన్నే వాడుకోవాలి. ఎప్‌ఫీఎఫ్ లేని ఫౌండేషన్‍ను ఈ కాలంలో వాడుకోవడం ఎంతైనా అవసరం. లేదంటే.. వేసవి ఉక్కబోతకు ముఖమంతా తెల్ల తెల్లగా కనిపిస్తుంది. ఈ వేసవిలో మేకప్ ఎంత తక్కువ ఉంటే అత మంచిదనే ప్రాథమిక నియమాన్ని తప్పకుండా పాటించాలి.
వేసవిలో పెదాలకు లిప్‌స్టిక్ వేసుకోకపోవడమే మంచిదంటున్నారు. ఒకవేళ తప్పదనుకుంటే ముందుగా పెదాలను స్క్రబ్ చేసుకోవాలి. ఆపై లిప్‌బామ్ రాసుకోవాలి. ఆ తరువాత పెన్సిల్‌తో లిప్‌లైన్ గీసుకుని తప్పదనుకుంటే గులాబీ, పీచ్, కోరల్ రంగులు ఎంచుకోవచ్చు.